Goa: బురఖా ధరించి లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగి!

  • ముస్లిం మహిళపై కన్నేసిన ఉద్యోగి
  • మహిళగా వేషం వేసుకున్న విర్గిల్ ఫెర్నాండెజ్
  • అరెస్ట్ చేసిన గోవా పోలీసులు

ఓ ప్రభుత్వ ఉద్యోగి బురఖా ధరించి, లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లడంతో మహిళలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గోవా సెంట్రల్ బస్టాండ్ లో శనివారం నాడు జరిగింది. ముస్లిం మహిళగా వేషం వేసుకున్న విర్గిల్ ఫెర్నాండెజ్ అనే 35 ఏళ్ల ఉద్యోగి ఆడవాళ్ల శౌచాలయంలోకి ప్రవేశించాడు. "ఓ ముస్లిం మహిళపై కన్నేసిన విర్గిల్ ఈ పని చేశాడు. పనాజి బస్టాండ్ లో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 419 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం" అని పోలీసులు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News