balakrishna: 'నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోకు' .. 'మహానాయకుడు' ట్రైలర్ రిలీజ్

  • ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంగా 'మహానాయకుడు'
  • మౌనం మారణాయుధమని మరిచిపోకు
  •  ఈ నెల 22వ తేదీన థియేటర్లకు  

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన 'మహానాయకుడు' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం మొదలుకుని .. ఒక మహానాయకుడిగా ఎదిగిన తీరును ఈ భాగంలో చూపించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు.

రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం .. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు .. ఢిల్లీ రాజకీయాలను ఎదిరించిన తీరు .. బసవతారకం అనారోగ్యానికి గురికావడం .. ఇలా ఆయనను కదిలించిన సంఘటనలు .. కలచివేసిన సన్నివేశాలు చూపించారు. "నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోవద్దు .. మౌనం మారణాయుధంతో సమానమని మరిచిపోకు' అంటూ 'మహానాయకుడు' చెప్పిన డైలాగ్ బాగుంది.

 ఈ ట్రైలర్ .. సినిమాపై అంచనాలు పెంచుతుందనడంలో సందేహం లేదు. 'కథానాయకుడు' ఫలితం నిరాశపరచడంతో నందమూరి అభిమానులంతా 'మహానాయకుడు'పై ఆశలు పెట్టుకున్నారు. అలాంటి 'మహానాయకుడు' వాళ్లు ఆశించినట్టుగా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.

balakrishna
vidyabalan
  • Error fetching data: Network response was not ok

More Telugu News