punjab: పుల్వామా ఘటనపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. కపిల్ శర్మ షో నుంచి జడ్జిగా సిద్ధూ తొలగింపు!

  • పాకిస్థాన్ ను వెనకేసుకొచ్చేలా వ్యాఖ్యలు చేసిన సిద్ధూ
  • సిద్ధూ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు  
  • సిద్ధూ స్థానంలో అర్చనా పూరణ్ సింగ్

పుల్వామా ఘటనపై సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యల ఫలితంగా కపిల్ శర్మ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న సిద్ధూని సోనీ కంపెనీ తొలగించినట్టు సమాచారం. సిద్ధూ స్థానంలో అర్చనా పూరణ్ సింగ్ ని నియమించినట్టు తెలుస్తోంది. కాగా, పుల్వామా ఘటనపై నిన్న సిద్ధూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కొంతమంది చేసిన తప్పుకు దేశం మొత్తాన్ని నిందించడం తగదంటూ పాకిస్థాన్ ను వెనకేసుకొచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.

punjab
minister
navajyoth singh siddu
kapil sharma
  • Loading...

More Telugu News