Hyderabad: తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని.. హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న మహిళా టెక్కీ!

  • మాదాపూర్ లోని లేడీస్ హాస్టల్ లో ఘటన
  • వారం రోజుల క్రితమే హైదరాబాద్ కు రాక
  • కేసు నమోదుచేసిన పోలీసులు

తెలంగాణలోని హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్ లోని అరుణోదయ లేడీస్ హాస్టల్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25) ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న శ్రీవిద్య ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది. అయితే ఉదయం అయినప్పటికీ గది తలుపు తీయకపోవడంతో హాస్టల్ సిబ్బంది కిటీకీ నుంచి చూడగా, ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.

దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అరుణోదయ హాస్టల్ లో శ్రీవిద్య ఈ నెల 10న చేరింది. ఈ విషయమై మాదాపూర్ పోలీసులు మాట్లాడుతూ.. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. బాధితురాలిది ఆత్మహత్య లేక హత్య అన్నది పోస్ట్ మార్టం తర్వాతే తేలుతుందని వ్యాఖ్యానించారు. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు హాస్టల్ సిబ్బంది చెప్పారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Hyderabad
Telangana
Police
softwear enginerr
suicide
  • Loading...

More Telugu News