Telangana: సిద్ధిపేటలో రూ.10కే చీర ఆఫర్ పెట్టిన షాపింగ్ మాల్.. ఎగబడిన మహిళలు.. తీవ్ర తొక్కిసలాట!

  • పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
  • నగలు, పర్సులు కొట్టేసిన దొంగలు
  • ఒక్కసారిగా మాల్ గేటు తెరవడంతో ఘటన

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఈరోజు సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లను ఆకర్షించేందుకు సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్కో చీరను రూ.10కే అమ్ముతున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల మహిళలు, స్థానికులు భారీ సంఖ్యలో షాపింగ్ మాల్ ముందు గుమిగూడారు. ఈరోజు మాల్ యాజమాన్యం ఒక్కసారిగా గేట్లు తెరవడంతో లోపలకు వెళ్లేందుకు మహిళలు ఎగబడ్డారు.

ఈ సందర్భంగా చాలామంది మహిళలు కిందపడిపోగా, వారిని తొక్కుకుంటూ మిగతావారు ముందుకెళ్లిపోయారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో మాల్ సిబ్బంది వీరిని ఆసుపత్రికి తరలించారు. కాగా, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా దొంగలు సైతం తమ చేతివాటం చూపారు. చీరలకు ఆశపడి వచ్చిన కస్టమర్ల నగలు, మొబైల్ ఫోన్లు,పర్సులు దొంగలించేశారు. దీంతో పలువురు బాధితులు లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకున్నారు.

Telangana
Siddipet District
shopping mall
women
  • Loading...

More Telugu News