Andhra Pradesh: అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన విజయ్ దేవరకొండ!

  • భారత్ కే వీర్ వెబ్ సైట్ ద్వారా విరాళం
  • మిగతా సెలబ్రిటీలూ ముందుకు రావాలన్న నటుడు
  • సైనికుల జీవితాలను డబ్బులతో వెల కట్టలేమని వ్యాఖ్య

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గత గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో ఉగ్రవాదులకు, వారికి ఊతమిస్తున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం స్పందించాడు. అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి ఓ అడుగు ముందుకు వేసి మిగతా నటీనటులకు, సెలబ్రిటీలకు స్ఫూర్తిగా నిలిచాడు.
తాను ఎంత మొత్తం సాయం చేశాడన్నది తెలియకుండా.. విరాళానికి సంబంధించిన సర్టిఫికెట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన bharatkeveer.gov.in వెబ్ సైట్ కు విరాళాన్ని అందజేశాడు.  అనంతరం స్పందిస్తూ..‘వారు మన కుటుంబాలను రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేం. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికి మద్దతుగా ఉండే వాతావరణాన్ని సృష్టిద్దాం’ అని ట్వీట్ చేశాడు.

Andhra Pradesh
Telangana
Jammu And Kashmir
pulwama terror attack
vijay devarakonda
compensation
donation
bharat ke veer
  • Loading...

More Telugu News