bhuma akhilapriya: అదంతా దుష్ప్రచారం మాత్రమే: భూమా అఖిలప్రియ

  • సీట్లు రాని వారు పార్టీ మారడం సహజమే
  • మంత్రులు పార్టీ మారనున్నారనే వార్తలు అవాస్తవం
  • టికెట్ల విషయంలో చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారారు. మరోవైపు కొందరు మంత్రులు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జంప్ జిలానీలపై మంత్రి భూమా అఖిలప్రియ సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో సీట్లు రాని వారు పార్టీ మారడం సహజమేనని ఆమె అన్నారు.

 మంత్రులు పార్టీ మారబోతున్నారనే వార్తల్లో వాస్తవంలేదని... మంత్రులు ఎవరూ పార్టీ మారరని చెప్పారు. ఇదంతా కేవలం దుష్ప్రచారం మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనులతో ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి, ఓట్లు అడుగుతామని చెప్పారు. టెకెట్ల విషయంలో చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని... తమ సీట్లపై తమకు నమ్మకం ఉందని అన్నారు. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

bhuma akhilapriya
Telugudesam
ticket
  • Loading...

More Telugu News