Jammu And Kashmir: ఇలా చేస్తాడని ఊహించలేదు: పుల్వామా ఉగ్రవాది అదిల్ తండ్రి

  • 12వ తరగతి చదువుతూ ఉగ్రవాదంలోకి
  • ఇన్నేళ్లలో ఒక్కసారి మాత్రమే ఫోన్
  • కోరుకున్న జీవితం దక్కిందని చెప్పాడని గుర్తు చేసుకున్న తండ్రి

పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే ఉగ్రవాది అదిల్ అహ్మద్ దర్ ఇల్లు వదిలి చాలా కాలమైందని, అతడితో తమకు సంబంధాలు లేవని అతడి తండ్రి గులామ్ దర్ పేర్కొన్నాడు. 12వ తరగతి పరీక్షలు రాశాక ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఆ తర్వాత ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, తమకు ఎప్పుడూ చెప్పలేదన్నాడు. ఇన్నేళ్ల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే తమకు ఫోన్ చేశాడని గుర్తు చేసుకున్నాడు.  

తాను చాలా ఆనందంగా ఉన్నానని, కోరుకున్న జీవితం దక్కిందని చెప్పాడని, అయితే, ఏం చేస్తున్నావని ఎంత అడిగినా చెప్పలేదని పేర్కొన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని తమకు తెలియదని, ఇలాంటి పనిచేస్తాడని అస్సలు ఊహించలేదని గులామ్ పేర్కొన్నాడు.

Jammu And Kashmir
Pulwama
Terror Attack
adil ahmed
Gulam
  • Loading...

More Telugu News