srinagar: శ్రీనగర్ నుంచి ఢిల్లీ చేరుకున్న జవాన్ల భౌతికకాయాలు.. నివాళులర్పించిన ప్రధాని మోదీ
- పాలెం విమానాశ్రయంలో అమర జవాన్లకు నివాళులు
- నివాళులర్పించేందుకు హాజరైన కేంద్ర మంత్రులు
- ‘కాంగ్రెస్’ అగ్ర నేత రాహుల్, ఆర్మీ అధికారులూ హాజరు
జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల భౌతికకాయాలు ఢిల్లీ చేరుకున్నాయి. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో జవాన్ల శవపేటికలను ఉంచారు. అమరజవాన్లకు నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్మీ అధికారులు తదితరులు హాజరయ్యారు. అమరజవాన్ల శవపేటికల చుట్టూ మోదీ తిరిగి, నమస్కరించారు. అనంతరం, అక్కడి నుంచి మోదీ విషాద వదనంతో వెళ్లిపోయారు. కాగా, అమర జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాలని బీజేపీ నేతలకు ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. ఈ మేరకు బీజేపీ పాలిత ప్రాంతాల్లోని మంత్రులు, ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు.