Jayaram: జయరాం హత్యలో ఐదుగురు? విశాల్, నగేశ్‌లను విచారిస్తున్న పోలీసులు!

  • పెద్దగా సహకరించని రాకేష్
  • తెరపైకి ఇద్దరు పోలీసు అధికారుల పేర్లు
  • మరో ముగ్గురు అధికారులకు ఫోన్

పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. విచారణకు రాకేష్ రెడ్డి పెద్దగా సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉండటంతో నేటి రాత్రి వరకూ రాకేష్‌ను విచారించిన మీదట రేపు ఉదయం న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే జయరాం హత్యలో ఐదుగురు పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఎస్ఆర్ నగర్‌కు చెందిన విశాల్, నగేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు జయరాం హత్య జరిగిన రోజు రాకేష్ ఇంట్లో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల పేర్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. మరో ముగ్గురు అధికారులతో రాకేష్ ఫోన్‌లో సంభాషించినట్టు సమాచారం. రాకేష్, జయరాంకు మధ్య రూ.4.5 కోట్ల లావాదేవీల విషయమై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Jayaram
Rakesh Reddy
Nagesh
Vishal
SR Nagar Police
  • Loading...

More Telugu News