Jagan: జగన్ విలువలు ఎంతో నచ్చాయి.. త్వరలో వైసీపీలో చేరుతా: వైసీపీ అధినేతతో భేటీ అనంతరం దాసరి జైరమేష్

  • టీడీపీలో ఉండి సంపాదించిందేమీ లేదు
  • చంద్రబాబు సీఎం కావడానికి కారణం నేనే
  • పార్టీని కాపాడటానికి నా వంతు ప్రయత్నం చేశా

ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ నేడు వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ఉండి తాను సంపాదించిందేమీ లేదని, ఆ పార్టీకి, చంద్రబాబుకు ఎంతో సాయం చేశానని అన్నారు. జగన్ విలువలు తనకెంతో నచ్చాయనీ.. త్వరలోనే వైసీపీలో చేరుతానని అన్నారు.

పార్టీ ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని జై రమేష్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రతీ ఎమ్మెల్యే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ సంపాదించారని ఆరోపించారు. చంద్రబాబు సీఎం కావడానికి కారణం తానేనని, నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా పార్టీని కాపాడటానికి తన వంతు ప్రయత్నం చేశానని జై రమేష్ పేర్కొన్నారు.

Jagan
Jai Ramesh
YSRCP
Chandrababu
Nadendla Bhaskar Rao
Telugudesam
  • Loading...

More Telugu News