Jammu Kashmir: ఈ హేయమైన చర్యకు ప్రతీకారం తీర్చుకుని తీరుతాం: సీఆర్పీఎఫ్

  • ముక్తకంఠంతో ఖండిస్తున్న దేశం
  • అమరులైన వారికి సెల్యూట్ చేస్తున్నాం
  • సోదరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనను దేశం ముక్తకంఠంతో ఖండిస్తోంది. దాడికి పాల్పడిన వారిని మరచి పోయేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని సీఆర్ఫీఎఫ్ నేడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

‘‘మేము మరచిపోము, మేము క్షమించబోము.. పుల్వామా దాడిలో అమరులైన వారికి మేము సెల్యూట్ చేస్తున్నాం. అమరులైన మా సోదరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం. ఈ హేయమైన చర్యకు ప్రతీకారం తీర్చుకుని తీరుతాం’’ అంటూ ట్వీట్‌లో సీఆర్పీఎఫ్ ప్రకటించింది.

Jammu Kashmir
Pulvama
Terrorists
CRPF
  • Loading...

More Telugu News