Mahesh Babu: నిహారికతో సినిమా నిర్మించనున్న సుకుమార్!

  • గ్యాప్ తీసుకున్న సుకుమార్
  • అనిల్ రావిపూడికి దారిచ్చారంటూ వార్తలు
  • సుకుమార్ శిష్యులలో ఒకరు దర్శకత్వం

‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పటికీ తరువాత సినిమా కోసం దర్శకుడు సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సుక్కు సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమై పోయారని.. దీనికి మహేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ బాగా వినిపించింది. అయితే తాజాగా మహేశ్ ‌తో సినిమా విషయంలో సుక్కు సైడ్ అయిపోయి అనిల్ రావిపూడికి దారిచ్చారంటూ మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

మహేశ్‌తో సినిమా మాటెలా ఉన్నా.. ఆమధ్య ‘సుకుమార్ రైటర్స్’ అనే సంస్థను స్థాపించిన సుక్కు ప్రస్తుతం చిత్ర నిర్మాణంలో బిజీ అయిపోయాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి రెండు సినిమాలను నిర్మిస్తున్న సుక్కు.. నాగబాబు కూతురు నిహారిక కొణిదెలతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇది కథానాయిక ప్రాధాన్యమున్న సినిమా అని.. సుక్కు శిష్యులలో ఒకరు దర్శకత్వం వహిస్తారని ఫిలింనగర్‌ టాక్. 

Mahesh Babu
Sukumar
Niharika
Anil Ravipudi
Sukumar Writers
  • Loading...

More Telugu News