Telangana: గవర్నర్ ను కలుసుకున్న సీఎం కేసీఆర్.. ఈ నెల 19న మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం!

  • రాజ్ భవన్ లోనే ప్రమాణస్వీకార కార్యక్రమం
  • ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
  • 10 మంది బాధ్యతలు స్వీకరించే ఛాన్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుసుకున్నారు. అనంతరం ఈ నెల 19న మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు గవర్నర్ కు తెలిపారు. అదే రోజున రాజ్ భవన్ లో మంత్రివర్గం ప్రమాణస్వీకారాన్ని చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, ఈసారి కేబినెట్ లో 10 మంది మంత్రులకు చోటు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది కొత్తవారికే అవకాశాలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.

Telangana
cabinet
extension
february 19
  • Loading...

More Telugu News