pakistan high commissioner: పాకిస్థాన్ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసిన ఇండియా

  • సొహైల్ మహ్మూద్ ను పిలిపించుకున్న విజయ్ గోఖలే
  • పుల్వామా ఘటనపై నిరసన వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి
  • జైషే మొహమ్మద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ హైకమిషనర్ సొహైల్ మహ్మూద్ కు భారత్ సమన్లు జారీ చేసింది. మహ్మూద్ ను భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించుకున్నారు. పుల్వామాలో జరిగిన ఘటనపై ఈ సందర్భంగా తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. జైషే మొహమ్మద్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాక్ గడ్డపై నుంచి పని చేస్తున్న టెర్రరిస్టు సంస్థలను, వాటికి సహకరిస్తున్న వ్యక్తులను అణచివేయాలని సూచించారు.

pakistan high commissioner
sohail mahmood
foreign secretary
vijay gokhale
summons
  • Loading...

More Telugu News