Mamata Benergee: ప్రధాని పదవికి రాహుల్, చంద్రబాబు, శరద్ పవార్.. ఉన్నారు!: మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

  • ప్రధాని పదవికి చాలా మంది ఉన్నారు
  • కేసీఆర్ తో కూడా మాట్లాడాను
  • ఎన్నికలకు ముందే కూటమి కూర్పు

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో విపక్షాలన్నీ కలిసి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, ఒకవేళ కూటమి గెలిస్తే, ప్రధాని పదవి ఎవరిదన్న విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి రాహుల్ తో పాటు చంద్రబాబు, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా తదితరులంతా ఉన్నారని చెప్పారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వచ్చిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందే పొత్తులపై పూర్తి అవగాహన కుదుర్చుకుంటామని చెప్పారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని అన్నారు. ఒకవేళ కొన్ని పార్టీలు రాష్ట్రాల్లో పరస్పరం వ్యతిరేకించుకున్నా, జాతీయ స్థాయిలో కలసి పనిచేస్తామని అన్నారు. తాను కేసీఆర్ తో కూడా మాట్లాడానని, ఆయన కూడా కూటమిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాను ప్రధాని పదవిని కోరుకుంటున్నట్టు అసత్య ప్రచారం జరుగుతోందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.  

Mamata Benergee
PM
Prime Minister
Rahul Gandhi
Chandrababu
KCR
  • Loading...

More Telugu News