Chittoor District: హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపాడట... జరిమానా కట్టమంటూ నోటీసు పంపిన చిత్తూరు పోలీసులు!

  • శ్రీకాళహస్తి రూరల్ పోలీసుల తాఖీదు
  • రూ. 135 జరిమానా కట్టాలని చలాన్
  • తన కారు తిరుపతి దాటలేదంటున్న యజమాని

ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా కారును నడిపాడట. ఈ విషయాన్ని పేర్కొంటూ, చిత్తూరు పోలీసులు జరిమానా కట్టమంటూ నోటీసు పంపించారు. 'ఏపీ 03 బీజెడ్ 7345' అనే నంబర్ వాహనంపై హెల్మెట్ లేకుండా వెళుతున్నారని చెబుతూ రూ. 135 జరిమానా చెల్లించాలని కారు యజమానికి ఈ-చెలాన్ వచ్చింది.

శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు దీన్ని జారీ చేశారు. గురువారం రాత్రి పానగల్ సమీపంలో ఉల్లంఘన జరిగిందని, మార్చి 1లోపు జరిమానా కట్టాలని కూడా స్పష్టం చేశారు. ఇక తన వాహనం బైక్ కాదని, కారని, గురువారం రాత్రి తాను తిరుపతి దాటనేలేదని వాహన యజమాని మొత్తుకుంటున్నాడు. సాంకేతిక పొరపాటే జరిగిందో లేక తప్పుగా నంబర్ ను ఫీడ్ చేశారో... పోలీసులే స్పష్టం చేయాలి.

Chittoor District
Police
Helmet
Fine
  • Loading...

More Telugu News