Telangana: నల్లా కనెక్షన్ డిపాజిట్‌ను భారీగా తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక రూ.100కే!

  • ఇప్పటి వరకు రూ.10,500గా ఉన్న డిపాజిట్
  • వంద రూపాయలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం
  • ఫైల్‌పై సంతకం చేసిన కేసీఆర్

దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వారికి వంద రూపాయలకే నల్లా కనెక్షన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అలాగే, బీపీఎల్ కుటుంబాల కోసం ప్రస్తుతం ఉన్న రూపాయికే నల్లా కనెక్షన్ కూడా యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించింది.

ఇప్పటి వరకు పట్టణాల్లో దారిద్ర్యరేఖకు ఎగువున ఉన్న కుటుంబాలు (ఏపీఎల్) నల్లా కనెక్షన్ కోసం రూ. 6 వేలు, ఇంటి లోపల పెట్టుకోవాలంటే రూ.10,500 డిపాజిట్‌గా చెల్లించాల్సి వచ్చేది. డిపాజిట్ ఎక్కువగా ఉండడం వల్ల కనెక్షన్ తీసుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదని భావించిన ప్రభుత్వం డిపాజిట్ రుసుమును తగ్గించింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సంతకం చేశారు.

Telangana
KCR
Tap Connection
APL Families
Hyderabad
BPL
  • Loading...

More Telugu News