Jammu And Kashmir: శ్రీనగర్ ఘటనపై ఆరా.. రేపు శ్రీనగర్ వెళ్లనున్న కేంద్రమంత్రి రాజ్ నాథ్

  • జమ్ము కశ్మీర్ గవర్నర్ తో మాట్లాడిన రాజ్ నాథ్
  • కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీఆర్పీఎఫ్ డీజీతో కూడా
  • రేపటి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్న రాజ్ నాథ్

సీఆర్పీఎఫ్ 54వ బెటాలియన్‌కి చెందిన జవాన్లు జమ్ము-శ్రీనగర్ హైవే మార్గంలో ప్రయాణిస్తుండగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డ ఘటనపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీఆర్పీఎఫ్ డీజీతోనూ రాజ్ నాథ్ ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ రేపు శ్రీనగర్ కు వెళ్లనున్నారు. దీంతో రేపటి తన కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, జమ్ముకశ్మీర్ లో పరిస్థితులను సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షిస్తున్నారు.

Jammu And Kashmir
srinagar
central minister
rajnath singh
  • Loading...

More Telugu News