Andhra Pradesh: చంద్రబాబు చుట్టూ కులపిచ్చి విషవలయంలా ఉంది: ఆమంచి కృష్ణ మోహన్

  • ఈ విషవలయం రాష్ట్రాన్ని పెకిలించి వేస్తోంది
  • పరిపాలనా యంత్రాంగంలో అంతా బాబు సామాజిక వర్గం వారే
  •  2019 ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలుస్తుంది 

చంద్రబాబు చుట్టూ కులపిచ్చి విషవలయంలా ఉందని ఇటీవలే టీడీపీ వీడి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణ మోహన్ ఆరోపించారు. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈరోజు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఆమంచి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు చుట్టూ ఉన్న ఈ విషవలయం రాష్ట్రాన్ని పెకిలించి వేస్తోందని, పరిపాలనా యంత్రాంగాన్ని, పార్టీని చంద్రబాబు తన సామాజిక వర్గంతో నింపి అక్రమమార్గంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.  

పరిపాలనలో కీలక అధికారులంతా చంద్రబాబు మనుషులే ఉన్నారని, పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ వరకు అంతా ఆయన మనుషులేనని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ని పర్యవేక్షించేందుకు ఓ డీఐజీ పోస్టును సృష్టించి, చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాసరావుకి ఆ పోస్టును కట్టబెట్టారని, ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్.. చంద్రబాబుకు బంధువని విమర్శించారు. చంద్రబాబు తన కులానికి మాత్రమే సేవ చేసేందుకు ఉన్నారని, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని జోస్యం చెప్పారు.  

Andhra Pradesh
cm
Chandrababu
YSRCP
aamanchi
krishna mohan
ys jagan
  • Loading...

More Telugu News