Manchu Vishnu: లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిసిన మంచు విష్ణు దంపతులు

  • కాక మీదున్న ఏపీ రాజకీయాలు
  • భేటీకి రాజకీయ ప్రాధాన్యత
  • వైసీపీ తరుపున పోటీ చేస్తారని ఊహాగానాలు

సినీ నటుడు మంచు విష్ణు దంపతులు నేడు లోటస్‌పాండ్‌కు వెళ్లి వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. విష్ణు భార్య విరోనికా జగన్‌కి బంధువు. ఈ నేపథ్యంలోనే జగన్‌ను వీరు కలిశారని సమాచారం. కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కాక మీదున్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో జగన్, విష్ణుల కలయిక ఆసక్తికరంగా మారింది. ఇటీవల మోహన్ బాబు వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి కలయిక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Manchu Vishnu
Mohan Babu
Jagan
Vironica
Lotus Pond
Andhra Pradesh
  • Loading...

More Telugu News