bheemili: భీమిలి సీటు నాదే.. జగన్ హామీ ఇచ్చారు: వైసీపీ సమన్వయకర్త విజయనిర్మల

  • వైసీపీలో చేరుతున్న అవంతి శ్రీనివాస్
  • భీమిలి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు
  • భీమిలి వైసీపీలో కలకలం

అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఆయనకు విశాఖ జిల్లా భీమిలీ అసెంబ్లీ సీటును జగన్ కేటాయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, భీమిలి వైసీపీలో కలకలం మొదలైంది. భీమిలి టికెట్ తనదేనని వైసీపీ సమన్వయకర్త విజయనిర్మల చెప్పారు. టికెట్ విషయంలో జగన్ తనకు ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీలో ఎవరైనా చేరవచ్చని అన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి తనకు పిలుపు రాలేదని చెప్పారు.

bheemili
ysrcp
Telugudesam
jagan
vijayanirmala
  • Loading...

More Telugu News