manipur: స్కూలు ముందు ఐఈడీ బాంబు పెట్టిన దుండగులు.. చాకచక్యంగా పేల్చేసిన పోలీసులు!

  • మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఘటన
  • బాంబు స్క్వాడ్ కు సమాచారమిచ్చిన స్కూలు సిబ్బంది
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఈశాన్య భారతంలోని మణిపూర్ లో ఈరోజు పెను ప్రమాదం తప్పింది. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్, కాంచీపూర్ లో ఓ పాఠశాల వద్ద అనుమానాస్పద వస్తువును గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ సిబ్బంది దానిని శక్తిమంతమైన ఐఈడీ బాంబుగా గుర్తించారు. తొలుత పాఠశాల చిన్నారులతో పాటు చుట్టుపక్కల వారిని దూరంగా తీసుకెళ్లారు.

అనంతరం సదరు ఐఈడీ బాంబును పేల్చివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మణిపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇది ఉగ్రవాదుల పనే అయ్యుంటుందని భావిస్తున్నారు.

manipur
imphal
ied bomb
before school
Police
bomb squad
  • Loading...

More Telugu News