Devegowda: దేవెగౌడ మరణించబోతున్నారు... కుమారస్వామి కూడా... కన్నడనాట బీజేపీ నేత ఆడియో టేప్!

  • కుమారస్వామి ఆరోగ్యం బాగాలేదు
  • జేడీఎస్ కనుమరుగవుతుంది
  • బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ అంటున్నట్టుగా ఆడియో

కర్ణాటకలో బీజేపీ నేతల ఆడియో టేపుల వ్యవహారం ఇప్పటికే రాజకీయాల్లో సంక్షోభాన్ని రేపగా, బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ వాయిస్ గా భావిస్తున్న మరో ఆడియో విడుదలైంది. ఓ జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో ఆయన సంభాషించినట్టుగా ఉన్న ఆడియోలో, త్వరలోనే దేవెగౌడ చనిపోనున్నారని, ఆయన కుమారుడు, సీఎం కుమారస్వామి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉందని, అతి త్వరలో జేడీఎస్ కనుమరుగవుతుందని అన్నారు. జేడీఎస్ తో ఉంటే లాభం ఉండదని కూడా ఆయన అన్నారు.

ఈ తాజా ఆడియోను కన్నడ వార్తా చానెళ్లు ప్రసారం చేయడంతో, రగిలిన జేడీఎస్ కార్యకర్తలు, హసన్ జిల్లాలోని ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి దిగారు. దీన్ని అడ్డుకునేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. తనను హత్య చేసేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ప్రీతమ్ ఆరోపించగా, తమ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కుమారస్వామి కోరారు.

Devegowda
Kumaraswami
BJP
Audio Tape
  • Loading...

More Telugu News