Lakshmi's NTR: "నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నమ్మడమే"... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రయిలర్ చూడండి!

  • 9.27కు ట్రయిలర్ ను వదిలిన వర్మ
  • సినిమాలోని పలు డైలాగులు, సీన్లు
  • వైరల్ అవుతున్న ట్రయిలర్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రయిలర్ కొద్దిసేపటిక్రితం విడుదలైంది. 'రామ రామ రామ రామ...' అంటూ మొదలైన ట్రయిలర్ లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల పాత్రలను, నటుడు మోహన్ బాబు పాత్రను చూపించారు. 'స్వామీ... మీతో ఫోన్ లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే' అనే డైలాగ్, 'రాత్రుళ్లు కూడా అక్కడే ఉంటోందట' అన్న డైలాగ్, చంద్రబాబు పాత్రధారితో "ఈవిడ పేరు లక్ష్మీపార్వతి... మా జీవిత చరిత్ర రాస్తున్నారు" అన్న ఎన్టీఆర్ డైలాగ్ వినిపిస్తున్నాయి.

ఆపై "శారీరక సుఖం కోసమో... ఇంకేదో వ్యక్తిగతమైన ప్రోద్బలం కోసమో..." అనే డైలాగ్, 'దానికిగాని కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్' అన్న డైలాగులు ఉన్నాయి. ఆపై "ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరమంటే..." అంటున్న ఎన్టీఆర్ కుమారుడి డైలాగ్ వినిపిస్తుంది. దాని తరువాత తన కుమారులై ఉండి వాడితో చేరారా సిగ్గులేకుండా అని ఎన్టీఆర్ అనడం, లక్ష్మీపార్వతి మెడలో తాళి కట్టడం, వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ పై చెప్పులు విసిరిన దృశ్యాలను ట్రయిలర్ లో చూపించారు వర్మ. ఇక చివరిగా "నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నమ్మడమే" అంటున్న ఎన్టీఆర్ గొంతు వినిపిస్తుంది.

Lakshmi's NTR
Ramgopal Varma
Trailer
  • Error fetching data: Network response was not ok

More Telugu News