Andhra Pradesh: ఏపీ రాజధానిలో బసవతారకం కేన్సర్ ఆసుపత్రి.. నేడు భూమిపూజ

  • తుళ్లూరులో 15 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
  • బుధవారం స్థలాన్ని పరిశీలించిన బాలకృష్ణ
  • వెయ్యి పడకలతో మూడు దశల్లో ఆసుపత్రి నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు భూమి పూజ చేయనున్నారు. వెయ్యి పడకలతో మూడు దశల్లో నిర్మించనున్న ఈ ఆసుపత్రి కోసం ఏపీ ప్రభుత్వం తుళ్లూరులో 15 ఎకరాలు కేటాయించింది.

బుధవారం తుళ్లూరు వెళ్లిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిశీలించారు. ఈ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు ఫారూఖ్, కిడారి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు.  అనంతరం నిర్వహించనున్న సభకు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి చైర్మన్ హోదాలో బాలకృష్ణ అధ్యక్షత వహిస్తారు.

Andhra Pradesh
Tullur
Basavatarakam cancer Hospital
Chandrababu
Balakrishna
  • Loading...

More Telugu News