Telangana: కేసీఆర్ పుట్టినరోజు నాడు ప్లెక్సీలు వద్దు మొక్కలు నాటండి: కేటీఆర్

  • ఈ నెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు
  • ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటుకు వృథా ఖర్చు చేయొద్దు
  • ఇందుకు బదులుగా ఓ మొక్కను నాటాలి

ఈ నెల 17న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. కేసీఆర్ ను అభినందిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటుకు, బొకేల కోసం డబ్బులు వృథా చేయొద్దని సూచించారు. ఇందుకు బదులుగా ఓ మొక్కను నాటాలని కోరారు. తమ అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమను ఓ మొక్క నాటడం ద్వారా చాటిచెప్పాలని ఆ ట్వీట్ ద్వారా కేటీఆర్ పిలుపు నిచ్చారు.

  • Loading...

More Telugu News