kannada: ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీ దేవి కన్నుమూత

  • కొంత కాలంగా జయశ్రీకి అనారోగ్యం
  • హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • సినీ రంగ ప్రముఖుల సంతాపం

ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీ దేవి (60) కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు తుదిశ్వాస విడిచారు. జయశ్రీ మృతిపై కన్నడ, తెలుగు సినీ రంగ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. జయశ్రీ కుటుంబసభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.

కాగా, కన్నడ, తెలుగు భాషల్లో పలు హిట్ చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. చిరంజీవి, అర్జున్ లతో ‘శ్రీ మంజునాథ’ చిత్రంతో పాటు, ‘సైలెంట్’, ‘అమృత వర్షిణి’, ‘నమ్మోరా మదర హూవే’, ‘భవానీ’, ‘ముకుంద మురారి’ వంటి కన్నడ చిత్రాలను ఆమె నిర్మించారు. 

kannada
telugu
Tollywood
producer
nara jaya sri devi
  • Loading...

More Telugu News