: జగన్ వెంటే ఉంటాం: కొండా దంపతులు


అయోమయం వీడింది, అనిశ్చితి తొలగింది. కొండా దంపతుల రాజకీయ భవిత వైఎస్సార్సీపీతోనే ముడిపడి ఉంటుందని స్పష్టమైంది. ఈ రోజు జైల్లో జగన్ ను కొండా సురేఖ, కొండా మురళి కలిసి ఆయనతో మాట్లాడారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, జగన్ తమను పార్టీకి అండగా ఉండాలని కోరారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడేది లేదని ఆ దంపతులు స్పష్టం చేశారు. పార్టీని ముందుకు తీసుకెళ్ళేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా చెప్పారు.

కాగా, కొద్దిరోజుల క్రితం తమ అనుచరులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని జగన్ ను కోరామని కొండా దంపతులు వెల్లడించారు. పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. గత కొద్దికాలంగా కొండా దంపతులు వైఎస్సార్సీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పార్టీలో తమను పట్టించుకోవడంలేదంటూ పలుమార్లు వాపోయిన వీళ్ళిద్దరూ, ఇతర పార్టీలవైపూ దృష్టి సారించారు.

దీంతో నష్టనివారణ చర్యలకు ఉపక్రమించిన జగన్.. తన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డితో రాయబారం పంపారు. బాలినేని చర్చలు ఫలప్రదం కావడంతో కొండా దంపతులు సోమవారం లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. నేడు అధినేత జగన్ ను కలవడంతో పార్టీని వీడేది లేదన్న విషయం స్పష్టమైంది.

  • Loading...

More Telugu News