Prahlad Modi: ఈసారి బీజేపీకి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి!: ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ

  • బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయి
  • మరోసారి ప్రధాని పీఠంపై నరేంద్ర మోదీ
  • మంగళూరులో ప్రహ్లాద్ మోదీ

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సొంతంగానే 300కు పైగా సీట్లు వస్తాయని, ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి పగ్గాలను చేపట్టనున్నారని ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు పర్యటనలో ఉన్న ప్రహ్లాద్ మోదీ, మీడియా తనను అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

"2014 ఫలితమే ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతమవుతుంది. బీజేపీకి 300 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి" అని వ్యాఖ్యానించారు. గడచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసిందని ఆయన అన్నారు. ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి వచ్చినా కాంగ్రెస్ కు పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాల కూటములు గతంలో ఎన్నోమార్లు విఫలమయ్యాయని, ఇప్పుడూ అదే జరుగుతుందని చెప్పారు.

Prahlad Modi
Narendra Modi
BJP
2019
Lok Sabha
Elections
  • Loading...

More Telugu News