Telangana: ఆఫ్ఘనిస్థాన్ వైపు నుంచి గాలులు.. రేపు తెలంగాణలో వర్షాలు

  • ఆగ్నేయ దిశ నుంచి కూడా గాలులు
  • క్యుములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలు
  • నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

ఆఫ్ఘనిస్థాన్ వైపు నుంచి వీస్తున్న గాలులు, ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న గాలులు చత్తీస్‌గఢ్-తెలంగాణ ప్రాంతంలో కలవనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలుల కలయిక వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. సోమవారం రాత్రి మెదక్‌లో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌‌లో 16 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండం, హకీంపేటలలో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Telangana
Rain
Afghanisthan
Chhattisgarh
cumulonimbus clouds
  • Loading...

More Telugu News