congress: త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా: కిశోర్ చంద్రదేవ్

  • ఢిల్లీలో చంద్రబాబుతో ముగిసిన చంద్రదేవ్ భేటీ
  • మర్యాదపూర్వకంగానే చంద్రబాబుని కలిశాను 
  • ఏపీలో టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు

కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే బయటకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని కిశోర్ దేవ్ వీడినప్పటి నుంచి ఆయన టీడీపీలో చేరతారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

 అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో త్వరలోనే చేరబోతున్నానని, ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే బాబుని కలిసినట్టు చెప్పారు. ఏపీలో టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయ పార్టీ లేదని, వచ్చే ఎన్నికల్లో  తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయం తమ భేటీలో ప్రస్తావనకు రాలేదని అన్నారు.

congress
kishore chandra dev
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News