Rape: మంగళగిరి గ్యాంగ్ రేప్ ఘటన: జ్యోతికి మరో అమ్మాయితో నాలుగు సార్లు ఫోన్ చేయించిన శ్రీనివాసరావు!

  • ఇంట్లో ఉన్న జ్యోతిని బయటకు రప్పించేందుకు ప్లాన్
  • పదే పదే యువతి ఫోన్
  • ఆమె ఎవరన్న విషయపై పోలీసుల ఆరా

ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపుతున్న మంగళగిరి హత్యాచార ఘటనలో పోలీసులు విచారణ జరుపుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో ఉన్న జ్యోతిని బయటకు రప్పించేందుకు శ్రీనివాసరావు మరో అమ్మాయితో నాలుగు సార్లు ఫోన్ చేయించాడని, ఆమె పదేపదే ఫోన్ చేసిన తరువాతనే జ్యోతి బయటకు వచ్చి శ్రీనివాసరావుతో కలిసి వెళ్లిందని పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం ఆ యువతి ఎవరన్న విషయమై విచారణ జరుపుతున్నారు. ఆమె పట్టుబడితే, కేసులో మిస్టరీ అంతా వీడుతుందని భావిస్తున్నారు. తన ఫోన్ నుంచి జ్యోతికి కాల్ చేస్తే, ఆమె సోదరుడు లేదా మరెవరైనా లిఫ్ట్ చేయవచ్చన్న కారణంతోనే మరొకరితో ఫోన్ చేయించాడని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కాగా, ఈ కేసులో శ్రీనివాసరావు స్నేహితులపై అనుమానంతో వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Rape
Murder
Jyothi
Srinivasarao
Mangalagiri
Police
  • Loading...

More Telugu News