Rakul Preet Singh: వాలెంటైన్స్ డేపై నాకు ఎటువంటి నమ్మకాలూ లేవు!: రకుల్ ప్రీత్ సింగ్

  • 2018లో ఒక్క సినిమాలో కూడా కనిపించని రకుల్ ప్రీత్
  • 14వ తేదీన 'దేవ్'తో పలకరించనున్న బ్యూటీ
  • వాలెంటైన్స్ డేపై తనకు నమ్మకం లేదని వెల్లడి

ఇటీవల తెలుగులో అవకాశాలు పొందలేకపోతున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తన తాజాచిత్రం 'దేవ్' ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా 14వ తేదీన విడుదల కానుండగా, తన తాజా ఇంటర్వ్యూలో రకుల్, వాలెంటైన్స్ డేపై కీలక వ్యాఖ్యలు చేసింది.

14వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లో 'దేవ్' చిత్రాన్ని చూడబోతున్నానని చెప్పింది. వాలెంటైన్స్ డేపై తనకు ఎటువంటి నమ్మకాలూ లేవని, పాశ్చాత్య సంస్కృతిని భారతీయులు వేడుకగా చేసుకోవడంలో అర్థం లేదని అంది. ప్రేమకు ఒక రోజు పెట్టి, ఆ రోజు సంతోషంగా ఉండి, గిఫ్ట్ లు ఇచ్చుకుంటే సరిపోదని అభిప్రాయపడింది. ఆ ఒక్క రోజు ప్రేమించి, మిగతా సంవత్సరమంతా ప్రేమించకున్నా ఫర్వాలేదా? అని ప్రశ్నించింది. కమర్షియల్ కోణంలో మాత్రమే ఇవి బాగుంటాయని చెప్పింది. షాపింగ్స్, గిఫ్ట్స్ అంటూ డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడానికే ప్రేమికుల రోజు ఉందని చెప్పుకొచ్చింది.

Rakul Preet Singh
Valentines Day
Lovers
Love
Dev
  • Loading...

More Telugu News