Andhra Pradesh: కృష్ణా జిల్లాలో పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన... ఇద్దరు ఎస్సైలను వీఆర్ కు పంపిన జిల్లా ఎస్పీ!

  • మైలవరం, జి.కొండూరు ఎస్సైపై కొరడా
  • వైసీపీ నేతలు లంచం ఇవ్వబోయారని ఫిర్యాదు
  • రేపు అధికారిక ఆదేశాలు ఇవ్వనున్న ఎస్పీ

వైసీపీ నేతలు తమకు లంచం ఇవ్వబోయారని కృష్ణా జిల్లాలోని మైలవరం, జి.కొండూరు ఎస్సైలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయాలని కోరుతూ వైసీపీ నేతలు వసంత కృష్ణప్రసాద్, మాగంటి వెంకటరామారావు తమకు నగదు ఆఫర్ చేశారన్నారు.

దీంతో పోలీసులకు వ్యతిరేకంగా కృష్ణప్రసాద్, రామారావులు ఆందోళనకు దిగారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఒత్తిడితో పోలీసులు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఎస్పీ స్పందించారు. మైలవరం ఎస్సై శ్రీనివాస్ తో పాటు జి.కొండూరు ఎస్సైను వీఆర్ కు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై రేపు అధికారిక ఆదేశాలు జారీచేస్తామని ఎస్పీ కార్యాలయం తెలిపింది.  

Andhra Pradesh
Chandrababu
Telugudesam
uma
two sis
VR
Krishna District
YSRCP
  • Loading...

More Telugu News