Sivaji: గో బ్యాక్ అంటే గుజరాత్ వెళ్లి టీ దుకాణం పెట్టుకోమని అర్థం: మోదీకి సినీ నటుడు శివాజీ కౌంటర్

  • మోదీ చదువేంటో ఎవరికీ తెలియదు
  • జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం
  • తల్లిని సైతం లైనులో నిలబెట్టిన సంస్కృతి మోదీది

ప్రధాని మోదీపై సినీ నటుడు శివాజీ ఫైర్ అయ్యారు. మోదీ ఉడుత ఊపులకు భయపడే వారెవరూ లేరన్నారు. ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోట్ల రద్దు సమయంలో తల్లిని సైతం లైనులో నిలబెట్టిన సంస్కృతి మోదీదని ఫైర్ అయ్యారు. మోదీ చదువేంటో ఎవరికీ తెలియదని శివాజీ విమర్శించారు.

చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీకి భారతీయ సంస్కృతీసంప్రదాయాలు తెలియవని.. గో బ్యాక్ అంటే గుజరాత్ వెళ్లి టీ దుకాణం పెట్టుకోమని అర్థమని శివాజీ కౌంటర్ ఇచ్చారు. కియా మోటార్స్ ఏపీకి ఇచ్చామని మోదీ చెప్పటం దారుణమన్నారు. చంద్రబాబు సారథ్యంలో అద్భుతమైన అమరావతిని చూస్తామన్నారు.

Sivaji
Chandrababu
Narendra Modi
Gujarath
Kia Motors
Amaravathi
  • Loading...

More Telugu News