mega brother: నిహారికకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. కావాల్సిన క్వాలిటీస్ చెప్పేసిన నాగబాబు!

  • త్వరలోనే నిహారికకు పెళ్లి చేయబోతున్నాం
  • మంచి గుణం, పద్ధతైన కుర్రాడు అయితే చాలు
  • నాకు కులం, మతం పట్టింపు లేదు

తన కుమార్తె నిహారిక వివాహంపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. నిహారికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామనీ, త్వరలోనే పెళ్లి చేస్తామని నాగబాబు తెలిపారు. నిహారికకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని అన్నారు. కుటుంబంలో మొత్తం నటులు ఉన్నప్పుడు తనకు నటించాలని ఎందుకు ఉండదని ప్రశ్నించినట్లు చెప్పారు. ఈ రోజు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై నాగబాబు ముచ్చటించారు.

నిహారిక కెరీర్ పై నాగబాబు మాట్లాడుతూ..‘‘నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ అనుకున్నంత బాగా ఆడలేదు. తర్వాత తమిళంలో నటించింది, అది ఫర్వాలేదు. మూడో సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్‌’. అదీ పెద్దగా ఆడలేదు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మధ్యలో ‘ముద్దపప్పు’ అనే సిరీస్‌లో నటించింది. అది విజయవంతం అయ్యింది. ఇప్పుడు ‘సూర్యకాంతం’ అనే సినిమా చేస్తోంది. ఆడపిల్లని నటనకు పంపాలా? వద్దా? అనుకుంటున్నప్పుడు తను.. ‘నేను నటిస్తా నాన్నా. సరైన కథలు ఎంచుకుంటాను. కుటుంబంలో మొత్తం నటులు ఉన్నప్పుడు నటించాలని నాకు ఎందుకు ఉండదు’ అని చెప్పింది.

సరే అని ఒప్పుకున్నా. తనకు నేను ముందుగానే చెప్పా రెండు, మూడేళ్ల తర్వాత పెళ్లి చేస్తానమ్మా అని.. సరే అంది. అయితే అల్లుడు ఎవరని ఇంకా ఏమీ అనుకోలేదు. సంబంధాలు వెతుకుతున్నాం. సినీ రంగం నుంచే కావాలనే ఆంక్షలు ఏమీ లేవు. మంచి గుణం, పద్ధతైన కుర్రాడయితే చాలు. నాకు కులం, మతంతో పెద్ద పట్టింపులు లేవు. 2018 వరకు నిహారికకు టైమ్‌ ఇచ్చా. 2019 వచ్చింది.. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేస్తా’ అని నాగబాబు అన్నారు.

mega brother
nagababu
niharika
marriage
no caste and religious feelings
  • Loading...

More Telugu News