Rammohan Naidu: ఇంతటి దారుణం ఎప్పుడూ జరగలేదు: పార్లమెంటులో ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజం

  • పార్లమెంటులో తీవ్ర స్థాయిలో ఆగ్రహం
  • సాయం చేసుంటే మాట్లాడాల్సి వచ్చేది కాదు
  • ఏపీకి కేంద్రం తీరని ద్రోహం చేసింది
  • చంద్రబాబు విమర్శిస్తున్నారనటం దారుణం

ఏపీలో వెనుకబడిన జిల్లాల కోసం రూ.350 కోట్లు అకౌంట్‌లో వేసి.. ఆ తరువాత రాజకీయ కక్షతో కేంద్రం వెనక్కి తీసుకుందని.. ఇంతటి దారుణం ఎప్పుడూ జరగలేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. నిన్న గుంటూరులో మోదీ చేసిన విమర్శలపై, ఏపీ సమస్యలపై నేడు ఆయన పార్లమెంటులో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి చేయాల్సిన సాయం కేంద్రం చేసి ఉంటే.. తాము మాట్లాడాల్సి వచ్చేది కాదని.. ఇలా ధర్మ పోరాట దీక్షలు చేయాల్సి వచ్చేది కాదన్నారు. ఏపీకి కేంద్రం తీరని ద్రోహం చేసిందని.. నాలుగున్నరేళ్లుగా సాయంపై తీవ్ర జాప్యం చేస్తోందంటూ మండిపడ్డారు. రైల్వే జోన్ హామీని సైతం తుంగలో తొక్కిందని రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు తనను విమర్శిస్తున్నారని మోదీ అనటం దారుణమని.. చంద్రబాబు ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలకు దిగలేదని, ఏపీ కోసం మాత్రమే మాట్లాడారని అన్నారు.

Rammohan Naidu
Chandrababu
Narendra Modi
Andhra Pradesh
Railway Zone
  • Loading...

More Telugu News