: బాబే పెద్ద అవినీతిపరుడు: కన్నా


టీడీపీ అధినేతను మించిన అవినీతి పరుడు రాష్ట్ర చరిత్రలోనే లేడని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బాబుపై విరుచుకుపడ్డారు. క్విడ్ ప్రో కో కేసుకు సంబంధించిన 26 జీవోల్లో తన ప్రమేయం లేదన్న కన్నా, రాజకీయంగా ఎదుర్కోలేని బాబు తన అనుచరులతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి మంత్రులను తొలగించాలంటూ బాబు గవర్నర్ ను కలవడం విచిత్రంగా ఉందన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో రిలీఫ్ ఫండ్ లో కూడా అవినీతి జరిగిందని విమర్శించారు. ఆయనలా అవినీతి ఆరోపణలపై తాము కనీసం స్టేలు కూడా తెచ్చుకోలేదని చురక అంటించారు.

  • Loading...

More Telugu News