Rajanikanth: దశాబ్దాల తర్వాత మళ్లీ సూపర్ స్టార్ చిత్రానికి ఛాన్స్!

  • అందరూ కోరుకునే కెమెరామెన్ సంతోష్ 
  • 1991లో వచ్చిన 'దళపతి'
  • రజనీ, మురుగదాస్ చిత్రానికి ఛాన్స్  

తన అద్భుతమైన ఫొటోగ్రఫీతో ఆయా సినిమాలకు మరింత అందాన్ని తెచ్చిన కెమెరామెన్ గా సంతోష్ శివన్ కు ఎంతో పేరుంది. తమ సినిమాలకు ఆయనే కావాలని ఆయా దర్శకులు, హీరోలు కోరుకునే టెక్నీషియన్ ఆయన. అటువంటి సంతోష్ సుమారు 28 సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రానికి పనిచేస్తున్నారు.

1991లో రజనీకాంత్ నటించిన 'దళపతి' చిత్రానికి ఆయన పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ రజనీకాంత్ చిత్రానికి కలసి పనిచేసే అవకాశం ఆయనకు రాలేదు. ఇన్నేళ్లకు మళ్లీ వీరిద్దరూ కలుస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సంతోష్ ట్వీట్ చేస్తూ, 'దళపతి తర్వాత మళ్లీ ఇప్పుడు రజనీ సార్ తో కలసి పనిచేస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్ గా వుంది' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.    


Rajanikanth
Santosh
Dalapathi
Murugadas
  • Loading...

More Telugu News