Andhra Pradesh: చంద్రబాబుతోనే కాదు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5తో కూడా పోరాడుతున్నాం!: జగన్

  • గత ఎన్నికల్లో ఓట్ల తేడా 5 లక్షలే
  • చంద్రబాబు చేయని డ్రామా, వేయని సినిమా ఉండదు
  • అనంతపురం‘సమరశంఖారావం’ సభలో జగన్

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి మధ్య ఓట్ల తేడా కేవలం 5 లక్షలు మాత్రమేనని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు చేయని డ్రామా, చూపించని సినిమా ఉండదని విమర్శించారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఈరోజు జరిగిన ‘సమరశంఖారావం’ సభలో జగన్ ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కేవలం సీఎం చంద్రబాబుపైనే పోరాడటం లేదని జగన్ తెలిపారు. ‘చంద్రబాబుకు సంబంధించిన యెల్లో మీడియాతో కూడా మనం పోరాటం చేస్తున్నాం. ఈనాడుతో పోరాటం చేస్తున్నాం. ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తున్నాం. టీవీ5తో పాటు చాలా ఛానల్స్ తో యుద్ధం చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీరందరిపై పోరాడాల్సి ఉందన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా చంద్రబాబు నాయుడిని భుజాలపై ఎత్తుకుని మోస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాల పట్ల వైసీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Andhra Pradesh
Chandrababu
Jagan
YSRCP
Anantapur District
yelloe media
criticise
  • Loading...

More Telugu News