Kadapa District: కడప టీడీపీ అధ్యక్షుడి వాట్స్ యాప్ ఖాతా బ్లాక్!

  • ఇప్పటికే సీఎం రమేష్ ఖాతా బ్లాక్
  • తొలుత టెక్నికల్ ఫాల్ట్ అనుకున్న టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి
  • కేంద్రం కుట్ర చేసిందని ఆరోపణ

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ అధికారిక ఫోన్‌ నెంబరుకు అనుసంధానమైన వాట్స్ యాప్ ఖాతాను బ్లాక్‌ చేసిన సంగతి మరువకముందే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వాట్స్ యాప్ కూడా బ్లాక్ అయింది. ఈ నెల 5వ తేదీ నుంచి తన ఖాతా ఆగిపోయిందని, తొలుత ఏదో టెక్నికల్ ఫాల్ట్ అనుకున్నానని, ఆపై వాట్స్ యాప్ నుంచి తన ఖాతాను నిలిపివేస్తున్నట్టు సమాచారం వచ్చిందని శ్రీనివాసరెడ్డి స్వయంగా వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రేనని, తెలుగుదేశం నాయకులను టార్గెట్ చేసుకుని, వాట్స్ యాప్ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తూ, తమ ఖాతాలను బ్లాక్ చేయిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, ప్రమాదకరమైన సమాచారం మార్పిడి జరిగినప్పుడు, తప్పుడు వార్తలు, వదంతులను ప్రచారం చేస్తున్నప్పుడు, ఓ ఖాతాపై వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరిగినప్పుడు వాట్స్ యాప్ ఆయా ఖాతాలను బ్లాక్ చేస్తుందన్న సంగతి తెలిసిందే.

Kadapa District
Srinivasareddy
Whats App
Block
Telugudesam
  • Loading...

More Telugu News