Chandrababu: ధర్మ పోరాట దీక్షకు ఏర్పాట్లు పూర్తి.. పటిష్ఠ భద్రత: ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్

  • ఢిల్లీకి చేరుకున్న టీడీపీ శ్రేణులు
  • 800 గదులు సిద్ధం
  • 45 ప్రత్యేక బస్సులు

రేపు ఢిల్లీలో జరగనున్న ఏపీ సీఎం ధర్మ పోరాట దీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. ఈ దీక్ష కోసం రాయలసీమ నుంచి టీడీపీ శ్రేణులు ప్రత్యేక రైలు ద్వారా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. వీరికోసం 45 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్టు, అలాగే వసతి ఏర్పాట్లు చేసినట్టు ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఢిల్లీకి వస్తున్నారని, వారి కోసం దాదాపు 800 గదులు సిద్ధంగా ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్టు ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు.

Chandrababu
Praveen Prakash
AP Bhavan
Delhi
Andhra Pradesh
  • Loading...

More Telugu News