ysrcp: ఒకే సామాజికవర్గానికి ఎక్కువ పదవులు కట్టబెట్టారంటూ.. జనసేనకు రాజీనామా చేసిన మత్తే బాబి

  • ఏలూరు పార్లమెంట్ ప్రధాన కమిటీల్లో ఒకే సామాజికవర్గానికి పదవులు ఇచ్చారు
  • కమిటీల్లో సమన్యాయం లేదు
  • పవన్ లో అంబేద్కర్ ఆశయాలు లేవు

జనసేనలో సామాజికన్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మత్తే బాబి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఏలూరు పార్లమెంట్ ప్రధాన కమిటీల్లో ఆరు ప్రధాన పదవులను ఒకే సామాజికవర్గానికి కేటాయించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనకు కులం, మతం లేదని పవన్ కల్యాణ్ చెబుతుంటారని... కానీ కమిటీల్లో సమన్యాయం చేయకుండా ఒకే సామాజికవర్గానికి పదవులను కట్టబెట్టారని విమర్శించారు. తనవి అంబేద్కర్ ఆశయాలని ఉపన్యాసాల్లో పవన్ చెబుతుంటారని... ఆచరణలో మాత్రం పవన్ లో అవి లేవని అన్నారు. 

ysrcp
eluru
committees
mathe babi
resign
  • Loading...

More Telugu News