Tollywood: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రిలీజ్ తేదీ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ!

  • ఈ నెల 14న ఉదయం 9.27 గంటలకు విడుదల
  • ట్విట్టర్ లో ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
  • నిజాన్ని చూసేందుకు సిద్ధమయిపోవాలని వ్యాఖ్య

సినీ ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాలను ఊరిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న ఉదయం 9.27 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తానని ప్రకటించారు.

వర్మ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల మోస్ట్ డైనమిక్ లవ్ స్టోరీ ట్రైలర్ ను  ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తున్నాం. విశ్వాసం లేని కుటుంబాలు, విధేయత లేని అనుచరులు, వెన్నుపోటుదారుల సమాహారమే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా. నిజాన్ని తెలుసుకోవడానికి సిద్ధమైపోండి’ అని ట్వీట్ చేశారు.

Tollywood
lakshmies ntr
trailers date
ram gopal varma
Twitter
  • Loading...

More Telugu News