Andhra Pradesh: జగన్ ఎక్కడ.. 26 కేసులకు భయపడి దాక్కున్నారా.. లేక లోటస్ పాండ్ లో పడుకున్నారా?: నారా లోకేశ్ సెటైర్

  • నేడు ప్రధాని మోదీ గుంటూరు టూర్
  • ట్విట్టర్ లో మండిపడ్డ ఏపీ మంత్రి
  • జైలుకు పంపుతారని జగన్ కు భయం పట్టుకుందని వ్యాఖ్య

ప్రధాని మోదీ గుంటూరు పర్యటన నేపథ్యంలో బీజేపీ, వైసీపీలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ రాష్ట్రానికి వస్తుంటే కేసులకు భయపడి జగన్ దాక్కున్నారని విమర్శించారు.

ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘మోదీ గారి పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడా? వైకాపా నాయకులు ఎక్కడ? 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా? అరెస్ట్ చేసి జైలు కి పంపుతారు అని భయం పట్టుకుందా? లేక లోటస్ పాండ్ లో పడుకున్నారా?’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి #GoBackModi #ModiIsaMistake హ్యష్ ట్యాగ్ ను జతచేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
BJP
Narendra Modi
lotus pond
Telugudesam
Chandrababu
Nara Lokesh
Guntur tour
  • Loading...

More Telugu News