Bharath: బాలికపై దాడికి ముందే రెక్కీ.. తన తల్లిదండ్రులను గదిలో బంధించిన భరత్: వెలుగు చూసిన సంచలన విషయాలు

  • వెంటపడొద్దని హెచ్చరించిన తల్లిదండ్రులు
  • గదిలో బంధించి గడియ పెట్టిన భరత్
  • అవమానించిందని బాలికపై కక్ష  

భరత్ అనే యువకుడు ఇంటర్ విద్యార్థినిపై కొబ్బరిబొండాలు నరికే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసును కాచిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తి, రక్త నమూనాలను పోలీసులు ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించారు. ఈ దర్యాప్తులో బాలికపై దాడికి ముందే భరత్ ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడని.. ఆమె వెంటపడొద్దని అతని తల్లిదండ్రులు కూడా అనేక మార్లు హెచ్చరించారని వెల్లడైంది.

దీంతో తన తల్లిదండ్రులు దాడిని అడ్డుకుంటారేమోనన్న అనుమానంతో భరత్.. వారిని ఇంట్లో బంధించి బయట గడియపెట్టినట్టు తెలిసింది. తనను ప్రేమించకపోగా.. భరోసా సెంటర్‌‌కు తన కుటుంబ సభ్యులను పిలిపించి అవమానించిందని.. అలాగే బాలిక తండ్రి తనతో గొడవపడటం తదితర విషయాలను అవమానంగా భావించి బాలికపై భరత్ కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అదను చూసుకుని బర్కత్‌పురాలో బాలికపై దాడికి తెగబడినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.  

Bharath
Barkathpura
Kachiguda
Police
FSL
  • Loading...

More Telugu News