Andhra Pradesh: ఏపీ డీజీపీ ఠాకూర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

  • మోదీ పర్యటనపై నిరసనలపై బీజేపీ స్పందన
  • మోదీని విమర్శిస్తూ ఫ్లెక్సీల ఏర్పాటుపై అభ్యంతరం
  • ఠాకూర్ ని కలిసిన బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్

రేపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పట్ల టీడీపీ నేతలు, వామపక్ష నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్య కుమార్ తదితరులు స్పందించారు. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఏపీకి అన్యాయం చేసిన మోదీ రాష్ట్రంలో పర్యటనకు రానుండటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. అయితే, తాము మోదీ పర్యటనను, ఆయన సభను అడ్డుకోమని, నల్ల జెండాలతో నిరసన మాత్రం వ్యక్తం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేయడం తెలిసిందే.

Andhra Pradesh
bjp
modi
congress
cpi
  • Loading...

More Telugu News