Arun Jaitly: ఇండియాకు తిరిగి వచ్చిన జైట్లీ.. సంతోషంగా ఉందంటూ ట్వీట్

  • ఎయిమ్స్‌లో మూత్ర పిండాల మార్పిడి
  • చికిత్స నిమిత్తం న్యూయార్క్
  • సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉన్న జైట్లీ

వైద్య చికిత్స నిమిత్తం న్యూయార్క్‌కు వెళ్లిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు ఇండియాకు తిరిగి వచ్చారు. గత ఏడాది మే నెలలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో జైట్లీ మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన వైద్య చికిత్స నిమిత్తం కొన్ని రోజులుగా న్యూయార్క్‌లోనే గడిపారు.

విదేశాల్లో ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆయన చురుకుగా ఉంటూ వస్తున్నారు. నేడు ఇండియాకు తిరిగి వచ్చిన జైట్లీ.. సొంతగడ్డపై తిరిగి అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. జైట్లీ అమెరికాలో ఉండటంతో ఆర్థిక శాఖ బాధ్యతలను మరో మంత్రి పీయూష్ గోయల్‌కి అప్పగించారు.

Arun Jaitly
BJP
New Delhi
Aims
Newyork
Social Media
Twitter
  • Loading...

More Telugu News