cbi: సీబీఐ విచారణకు హాజరైన కోల్ కతా సీపీ రాజీవ్ కుమార్

  • షిల్లాంగ్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణ
  • ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు
  • తొలుత సీబీఐ కార్యాలయంలో రాజీవ్ విచారణ

శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎట్టకేలకు హాజరయ్యారు. షిల్లాంగ్ లోని సీబీఐ కార్యాలయానికి ఈరోజు ఆయన వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. తొలుత సీబీఐ కార్యాలయంలో రాజీవ్ కుమార్ ను విచారించిన అనంతరం, ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆయన్ని ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసు విచారణకు రాజీవ్ కుమార్ సహకరించాలని, సీబీఐ అధికారుల విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణకు రాజీవ్ కుమార్ హాజరయ్యారు. నిన్న సాయంత్రమే ఆయన షిల్లాంగ్ చేరుకున్నారు.

cbi
kolkata
cp
rajiv kumar
shilang
  • Loading...

More Telugu News